జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు

ఇక ఈ ఆపరేషన్‌కు 12 మిరాజ్-2000 యుద్ధ విమానాలను భారత వాయుసేన వినియోగించింది. స్ట్రైక్స్ వందశాతం విజయవంతం అయ్యాయని భారత వాయుసేన అధికారులు తెలిపారు.
పుల్వామా ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దళాలు దాడులు చేసి ధ్వంసం చేశాయి. దాదాపు వెయ్యి కిలోల బాంబులు జారవిడిచినట్లు సమాచారం.భారత వైమానిక బృందం మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.