టార్గెట్ 2019 రెండు రాష్ట్రలో జనసేన
పవన్ కళ్యాణ్ సౌత్ ఇండియా లో తిరుగులేని నాయుడి గా ఎదుగుతున్నారు .. ప్రజారాజ్యం లో వచ్చిన అనుభవం తో చక్కగా పార్టీ ప్రజల్లో తీసుకు వెళ్తున్నారు .
టార్గెట్ 2019 రెండు రాష్ట్రలో జనసేన :
ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో ఉన్న పార్టీలకు భిన్నంగా జనసేన పార్టీ కార్యకర్తలు, నాయకులు ఉండేలా పవన్ కళ్యాణ్ జాగ్రత్తలు తీసుకొంటున్నారు. ఈ మేరకు తమ పార్టీలో చేరే వారి విషయంలో జనసేన చాలా జాగ్రత్తలు తీసుకొంటుంది. ఇతర పార్టీల కంటే జనసేన చాలా భిన్నంగా ఉంటుందనే అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించే ఉద్దేశ్యంతో పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు
రెండు రాష్ట్రాల్లో ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ వ్యూహ రచన చేస్తున్నారు. తొలుత జనవరి మాసం నుండి పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రంలో పాదయాత్ర నిర్వహించాలని భావిస్తున్నారు. ప్రత్యేక హోదా అంశంతో పాటు విశాఖకు ప్రత్యేక రైల్వే డివిజన్ అంశంపై పాదయాత్ర నిర్వహించే అవకాశం ఉందని సమాచారం .
అయితే ఎప్పటి నుండి , ఎక్కడి నుండి పాదయాత్ర చేస్తారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.