రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్ కు తీసుకెళ్లండి -కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్

రోహింగ్యాల మీద మీకు నిజంగా ప్రేముంటే పాకిస్తాన్ కు తీసుకెళ్లండి..’ అని పాకిస్తాన్ ను ఉద్దేశించి కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. ‘ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కశ్మీర్ లో మారణహోమం సృష్టిస్తున్నారు, సరిహద్దుల్లో టెర్రరిస్టులు నిత్యం చొరబాట్లకు ప్రయత్నిస్తున్నారు. చాలామంది దేశంలోకి ఇప్పటికే అక్రమంగా చొరబడ్డారు. ఈ పరిస్థితుల్లో దేశానికి రోహింగ్యా చొరబాటుదారులను భరించే శక్తి లేదని.. వాళ్లంతా దేశం విడిచి వెళ్లాల్సిందేనని’ గిరిరాజ్ సింగ్ స్పష్టం చేశారు.
మనదేశంలో ఉండే కొంతమంది నేతలు రోహింగ్యాలను సమర్థిస్తున్నారు.. రోహింగ్యాలతో పాటూ వాళ్లను కూడా పాకిస్తాన్ పంపితే సరిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు.