జనసేన లో ముసలం – జనసేన భక్తుల ఆవేదన

పవన్ ని కలవాలీ.. అని ఎన్ని సార్లు అనుకున్నా కలిస్తే ఏం లాభం ? మోహమాటంగా ఓ బలవంతపు నవ్వు నవ్వి ఓ సేల్ఫీ దిగేసి fb లో నేనూ పవన్తో ఫోటో దిగానోచ్చ్ అని పెట్టుకోవడం తప్ప .. మనం అనుకున్న లక్ష్యానికి ఎటువంటి లాభం ???
అదే కష్ట పడి పవన్ ఆశయాలకు అనుగుణంగా పనులు చేసి చూపిస్తే పవన్ మెచ్చి మనల్ని గుర్తించి ఎప్పుడోకప్పుడు తానే పిలిచి శెభాష్ అని మెచ్చుకుంటాడని.. తనకు కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడం ఇష్టం అని మేమూ మా పరిధిలో సేవా కార్యక్రమాలు చేసాం…
లాభం లేదూ.. సో ఇంకా ఏదో ఎక్కువగా పని చేయాలి అని అనుకున్నాం..
FB లో జనసైన్యాన్ని సంఘటితం చేసాం…
మూడు పెళ్లిళ్ల కళ్యాణ్.. పావలా కళ్యాణ్.. ప్యాకేజి కళ్యాణ్ అని వ్యక్తిగత విమర్శలు చేసిన
టీడీపీ వాళ్ళకీ.. వైస్సార్ సీపీ వాళ్ళకీ గట్టిగా సమాధానం చెప్పగలిగాం..
అప్పుడప్పుడు ఓ ట్వీట్ చేసి మళ్లీ కనబడదు అని అంటే సమస్యల పై చర్చించడానికి పవనే రానక్ఖరలేదు .. పవన్ ఆలోచనలను నమ్మే మా లాంటి సామాన్య కార్యకర్తె ఎక్కువ అని …
ఆడు నా ఫ్యాన్.. నేను చెప్పినా అడు చెప్పినా ఒక్కటే అని నువ్వే చెప్పావు కదా అనీ.. ముందు fb లోనూ.. ఆ తర్వాత టీవీ ల్లోనూ సమస్య లపై మాట్లాడాము..
.
“పలికెడిది భాగవతమట పలికించెడివాడు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికెద వేరొండు గాథ …”
.
సమస్య పై మాట్లాడింది మేమే ఐనా … నువ్వే మాతో మాట్లాడించావు కనుకనే అంత బాగా మాట్లాడ గలిగాము అని అనుకున్నాం…
ఈ దెబ్బతో నువ్వు మమ్మల్ని గుర్తించి పిలుస్తావూ.. అని ఎప్పటికప్పుడు అనుకోవడం.. నీనుంచి పిలుపు రాకపోవడం తో..ఓ రెండ్రోజులు నిరాశకు గురైనా.. నీకంటే మొండి వాళ్ళం కనుక.. అదీ కాక మన జనసేన కార్యకర్తల ప్రోత్సాహంతో ఎప్పటికప్పుడు నూతనోత్తేజంతో.. రెట్టింపు ఉత్సాహంతో నిన్ను ఎలా ఇంప్రెస్స్ చేయాలో అని ఇంకో కొత్త కార్యక్రమాన్ని మొదలు పెట్టే వాళ్ళం…
ఇందుల్లో భాగంగానే.. వైజాగ్ లో స్పెషల్ స్టేటస్ మీద అరెస్టు ఐనా.. తుందూరూ ఆక్వా పార్క్ ఐనా.. గరపగర్రు.. దళితుల ఇష్యూ పైన ఐనా.. మా స్థాయి లో మేం పనిచేసాం.. ఎక్కడా నీ స్థాయిని తగ్గే లా ప్రవర్తించలేదు..
.
వైయ స్సార్ సీపీ వాళ్ళు చంపేస్తాం అని బెదిరించినా ..అలా చచ్చినా నీకోసమేగా.. అంతకంటే ఇంకేం అదృష్టం అని ఆనందించాం…
ఫిరంగులకు కూడా ధైర్యంగా ఎదురొడ్డి నిలిచే సైన్యం కావాలి అని అన్నావుగా..అనీ..
.
స్వపక్షం వాళ్ళే మమ్మల్ని ఒక సారి tdp కోవర్టులనీ .. ఇంకోసారి వైసీపీ కోవర్టులని అన్నప్పుడు మాత్రమే భాధవేసేది… టీవీ డిబెట్స్ లో జన సేన అధికార ప్రతినిది వి అని ఎలా చెప్పుకుంటావూ అని ఊరూ పేరూ తెలియని ఫేక్ id వాళ్ళు అడిగిన ప్రతీసారి నెక్స్ట్ డిబేట్ లో డిబేట్ మొదలు అయ్యేముందే నేను జనసేన అధికార ప్రతినిదిని కానూ .. ఓ సామాన్య కార్యకర్తనే.. నేను ఎప్పుడూ పవన్ని కలవలేదూ.. అని చెప్పడమే జరిగింది…
ఐనా తొంబై డిబెట్స్ లో పాల్గొంటే ఒక్క డిబేట్ ఐనా నువ్వు చూసి ఉండవా ? లేక నీకు ఎవరో ఒకరు చెప్పి ఉండరా ? నీకు నచ్చి మమల్ని పిలవవా అని కలలు కనేవాళ్ళం…
.
చివరికి మా కలలూ కష్టాలూ ఫలించాయి.. ఎట్టకేలకు మా పని నీ దృష్టికి చేరింది..
“జనసేన శ్రేణుల్లారా తస్మాత్ జాగ్రత్త” అని నువ్వు నేడు రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ మాకెంతో ఆనందాన్ని చేకూర్చింది..
నేటి ఈ ప్రెస్ నోట్ ఫ్రేం కట్టించుకొని దాచుకుంటాం…